- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: వికసిత్ కేరళనే బీజేపీ లక్ష్యం.. కేంద్ర మంత్రి అమిత్ షా
కేరళ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) ఆరోపించారు. రాష్ట్రంలో తమ సీఎం లేకున్నా వికసిత్ కేరళనే బీజేపీ లక్ష్యమని నొక్కి చెప్పారు. తిరువనంతపురంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం మరార్జీ భవన్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. వరుసగా అధికారంలోకి వచ్చిన యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాలు అవినీతిలో మాత్రమే పాలుపంచుకున్నాయని విమర్శించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) లాంటి దేశ వ్యతిరేక శక్తులకు కేరళను సురక్షితమైన స్వర్గధామంగా మార్చాయని ఫైర్ అయ్యారు.
దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదని నొక్కి చెప్పారు. వికసిత్ భారత్‌కు మార్గం వికసిత్ కేరళ ద్వారా మాత్రమే సాధ్యమని తెలిపారు. బీజేపీ అభివృద్ధి కోసం పని చేస్తూ సీపీఎం తమ పార్టీ వ్యక్తుల కోసం పని చేస్తోందన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఎన్డీఏ పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్డీఏ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురాగలదని, ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు ఇది సాధ్యం కాదన్నారు.






