- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amith shah: సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష.. కీలక అదేశాలు జారీ
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) తెలిపారు. ముఖ్యమైన సేవలు సజావుగా జరిగేలా చూసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు సిద్ధం కావాలని ఆదేశించారు. భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత జమ్మూ కశ్మీర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లతో పాటు ఉత్తరప్రదేశ్ (Utharapradesh) , ఉత్తరాఖండ్ (Utharakhand) , పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ సహా సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా శాంతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు (SDRF), ఇతర అత్యవసర విభాగాలను అప్రమత్తంగా ఉంచాలని కోరారు. తప్పుడు సమాచారం వ్యాపించ కుండా సోషల్ మీడియాపై నిఘా పెంచాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ భద్రత రిత్యా సాయుధ దళాలు, పారామిలిటరీ యూనిట్లు, స్థానిక పరిపాలనల మధ్య సమన్వయం అవసరమని నొక్కి చెప్పారు.






