Amith shah: మహాకుంభమేళాకు అమిత్ షా.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం

by B.Srinivas |

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు.

Amith shah: మహాకుంభమేళాకు అమిత్ షా.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌ (Utharapradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో జరుగుతున్న మహాకుంభమేళాకు (Mahakumbamela) కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఆయన కుమారుడు ఐసీసీ చైర్మన్ జైషా(Jai shah), అనేక మంది హిందూ సాదువులతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. పడవలో అరలీ ఘాట్‌కు చేరుకున్న అమిత్ షా సుమారు 10 నిమిషాల పాటు స్నానం చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithyanath), డిప్యూటీ సీఎంలు కేపీ మౌర్య (Mourya), బ్రజేష్ పాఠక్‌లు సైతం అమిత్ షాతో ఉన్నారు. అంతకుముందు అమిత్ షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘సనాతన సంస్కృతికి మహాకుంభమేళా ఒక ప్రత్యేక చిహ్నం. ఇది సామరస్యం ఆధారంగా మన శాశ్వతమైన జీవిత తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. పవిత్ర నగరమైన ప్రయాగ్‌రాజ్‌లో ఐక్యత, సమగ్రతతో కూడిన ఈ గొప్ప పండుగలో ఆశీర్వాదాలు పొందాలని ఆసక్తిగా ఉన్నా’ అని తెలిపారు.

కాగా, ఈ నెల 13న మహాకుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇది ఫిబ్రవరి 26వరకు కొనసాగనుంది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి అనేక మంది సందర్భకులు భారీగా తరలి వస్తు్న్నారు. సోమవారం నాటికి సుమారు 13.21 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే 3.5 కోట్ల మంది భక్తులు గంగాస్నానం చేశారు. అయితే ఈనెల 29న మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పకడ్బంధీగా చేపడుతున్నారు.

Next Story