నక్సలిజం పాము లాంటిది : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

నక్సలిజం పాము లాంటిదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసారు.

నక్సలిజం పాము లాంటిది : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్ : నక్సలిజం పాము లాంటిదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆదివారం బస్తర్ ఒలంపిక్-2025 ముగింపు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్సలిజం ఎవరికీ ప్రయోజనం కలిగించదని, శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం చూపగలదని పేర్కొన్నారు. 2026 ఆగస్టు 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేసారు. నక్సలిజం విషపూరిత పాము లాంటిదని, దానిని పెంచి పోషించడం అంటే మన ప్రాణాలను హాని కలిగించుకోవడమేనని అన్నారు. వచ్చే ఏడాది కల్లా నక్సలిజాన్ని అంతం చేసి, దేశంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తామని తెలియజేసారు. కాగా ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇప్పటికే వందల మంది మావోయిస్టులు హతం అయిన సంగతి తెలిసిందే.

Next Story