Amith khare: సీపీ రాధాకృష్ణన్ సెక్రటరీగా అమిత్ ఖరే.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

by B.Srinivas |

నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే నియామకమయ్యారు.

Amith khare: సీపీ రాధాకృష్ణన్ సెక్రటరీగా అమిత్ ఖరే.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (Cp Radha Krishnan) సెక్రటరీగా మాజీ ఐఏఎస్ అధికారి అమిత్ ఖరే (Amith khare) నియామకమయ్యారు. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరే నియామకాన్ని కేబినెట్ అపాయింట్ మెంట్ కమిటీ (Cabinte appoints commitee) ఆమోదించినట్టు తెలిపింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు విధుల్లో ఉండనున్నారు. జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఖరే తన పదవీకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక కీలక పదవుల్లో పనిచేశారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో సెక్రటరీగా, విద్యా కార్యదర్శిగా విధులు నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం ప్రధాని సలహాదారుగానూ పని చేశారు. కాగా, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా అనంతరం వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నిక జరగగా సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Next Story