‘ఇండియా’ గెలిస్తే ‘రొటేషన్’ ప్రధానమంత్రి: అమిత్‌షా

by Harish |
‘ఇండియా’ గెలిస్తే ‘రొటేషన్’ ప్రధానమంత్రి: అమిత్‌షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి కుర్చీని కూటమిలోని సభ్యులందరూ పంచుకుంటారని, ‘రొటేషన్’ ప్రాతిపదికన ఏడాదికి ఒకరు చొప్పున పీఎం సీటులో కూర్చుంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్‌లోని మధుబని లోక్‌సభ స్థానంలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన, దేశానికి బలమైన ప్రధాన మంత్రి అవసరం, ఏడాదికి ఒకరు చొప్పున ఉండే వారు కాదు, ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు, వారి అభ్యర్థి ఎవరో నాకు చెప్పగలరా? మమతా బెనర్జీ ప్రధానమంత్రి అవుతారా లేదా ఎంకే స్టాలిన్ లేదా లాలూ ప్రసాద్ అవుతారా? వారు అధికారంలోకి రావడం లేదు. మోడీకి మూడవసారి అధికారం ఇవ్వాలని దేశం నిర్ణయించిందని ఇండియా కూటమిపై అమిత్‌షా విమర్శలు చేశారు.

దేశాన్ని నడపడం అంటే కిరాణా కొట్టు నడపడం లాంటిది కాదు, కోవిడ్ మహమ్మారి వంటి పరిస్థితి తలెత్తితే, వారు దేశాన్ని రక్షించగలరా? వారు ఉగ్రవాదుల నుండి దేశాన్ని రక్షించగలరా? భారతదేశానికి ఒక బలమైన ప్రధాని కావాలని షా అన్నారు. ఈ సందర్బంగా బీహార్‌లోని ఉత్తర ప్రాంతంలో గతంలో పశువుల అక్రమ రవాణా జరుగుతోందని పేర్కొంటూ, ఎన్‌డీఏ ప్రభుత్వం గోహత్యకు వ్యతిరేకం.. మేము దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలని చూస్తోంది, కాబట్టి పీఎఫ్‌ఐను నిషేధించాలనే కేంద్ర నిర్ణయం సరైనదేనని అమిత్ షా అన్నారు.

Next Story