- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amit Shah: మన సంకల్పం నిలబడింది.. ఎన్‌కౌంటర్ పై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
నక్సలిజానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: నక్సలిజానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) వ్యాఖ్యానించారు. ఒడిశా- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని (Odisha-Chhattisgarh Border) గరియాబంద్ జిల్లా కులారి ఘాట్ వద్ద భారీ ఎన్ కౌంటర్(Major Encounter) జరిగింది. ఇందులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై బీజేపీ నేత అమిత్ షా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. నక్సలిజానికి మరో గట్టి దెబ్బ తగిలిందని, నక్సల్స్ రహిత భారత్ నిర్మాణంలో మన భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయని చెప్పుకొచ్చారు. అలాగే సీఆర్‌పీఎఫ్ (CRPF), ఎస్ఓజీ ఒడిశా (SoG Odisha) మరియు ఛత్తీస్‌గఢ్ పోలీసులు(Chhattisgarh Police) ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లను మట్టుబెట్టారని తెలిపారు. ఇక నక్సల్స్ రహిత భారతదేశం కోసం మన సంకల్పం నిలబడిందని చెప్పారు. అంతేగాక మన భద్రతా దళాల ఉమ్మడి ప్రయత్నాలతో, నక్సలిజం ఈ రోజు అంతిమదశకు చేరుకున్నదని కేంద్రమంత్రి తెలియజేశారు.






