- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులపై అమిత్ షా మరోసారి హాట్ కామెంట్స్
మావోయిస్టులపై అమిత్ షా మరోసారి హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్(Operation Kagar)పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అమిత్ షా పర్యటించారు. డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాయ్‌పూర్‌లో నెక్ట్స్ జరగబోయే డీజీపీలు, ఐజీపీల సదస్సు నాటికి దేశం ఈ సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని కీలక ప్రకటన చేశారు. దేశ భద్రత, అంతర్గత శాంతిని కాపాడటంలో పోలీసులు ఎంతో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించగా.. వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలు వదిలేసి సరెండర్ అవుతామని మావోయిస్టులు మరో లేఖ విడుదల చేశారు.






