నేను చూసుకుంటా.. రెజ్లర్లకు అమిత్ షా స్పష్టమైన హామీ

by Disha Web Desk 12 |
నేను చూసుకుంటా.. రెజ్లర్లకు అమిత్ షా స్పష్టమైన హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ న్యాయం కోసం పోరాడుతున్న భారత రెజర్లు కేంద్రమంత్రి అమిత్‌ షాను కలిశారు. శనివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో భేటీ అయ్యారు. తాజాగా ఈ సమావేశ వివరాలు తాజాగా బయటికొచ్చాయి. బ్రిజ్ భూషణ్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, వేగంగా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను రెజ్లర్లను కోరారు. రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్‌, సత్యవర్త్‌ కడియన్‌, తదితరులు..అమిత్ షాతో భేటీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు (అర్ధరాత్రి వరకు) ఈ సమావేశం కొనసాగినట్లు సమాచారం.

ఈ సమస్యపై తాను దృష్టిసారిస్తానని అమిత్ షా రెజ్లర్లకు హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘చట్టం అందరికీ సమానమే.. చట్టాన్ని తన పని తాను చేయనివ్వండి అని అమిత్ షా రెజ్లర్లకు చెప్పినట్లు సమాచారం. తాము కేంద్రమంత్రితో భేటీ అయినట్లు బజ్‌రంగ్‌ పునియా మీడియా వద్ద ధ్రువీకరించారు. అయితే, ప్రస్తుతానికి అంతకంటే తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. కాగా, బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని..ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద 35 రోజుల పాటు రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. అయితే, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నాడు ముట్టడికి రెజ్లర్లు యత్నించగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ పరిణామాల అనంతరం రెజ్లర్లు అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed