రాహుల్ గాంధీకి సిగ్గుంటే మోడీకి క్షమాపణ చెప్పాలి: అమితం షా

by Phanindra |

ప్రధాని మోడీ, ఆయన తల్లిపై కాంగ్రెస్ యాత్రలో చేసిన దుర్భాషలను అమితం షా ఖండించారు. రాహుల్ గాంధీకి సిగ్గుంటే మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీకి సిగ్గుంటే మోడీకి క్షమాపణ చెప్పాలి: అమితం షా
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో కొందరు ప్రధాని మోడీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వేదికపై మోడీ, ఆయన తల్లిని దూషించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తల్లి నిరుపేద జీవితం గడిపినా.. తన పిల్లలను విలువలు నేర్పారని అమిత్‌ షా తెలిపారు. ఆమె నేర్పిన విలువలు, న్యాయబద్ధమైన జీవన విధానం వల్లే మోడీ ప్రధాని స్థాయికి ఎదిగారని అన్నారు.

అటువంటి ఆదర్శనీయమైన మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని దేశప్రజలు సహించరని, రాహుల్‌ గాంధీ రాజకీయ జీవితంలో ఇంతకంటే పెద్ద పతనం మరొకటి ఉండదని షా ఆగ్రహం వ్యక్తంచేశారు. మోడీ, ఆయన తల్లిని అవమానించినందుకు రాహుల్‌కు ఏమాత్రం సిగ్గున్నా.. క్షమాపణలు చెప్పాలని షా డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను దూషిస్తూ.. తప్పుడు ప్రచారాలు చేసే ‘ద్వేష సంస్కృతిని’ వ్యాప్తి చేయడమే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయంగా పెట్టుకుందని అమిత్‌ షా మండిపడ్డారు. ప్రధాని, బీజేపీపై కాంగ్రెస్‌ ఎంత బురద జల్లాలని చూస్తే.. అంతకు పదిరెట్లు విజయాలను సాధిస్తుందన్నారు.

Next Story