- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assam: అస్సాంలోనూ చెలరేగిన వక్ఫ్ బిల్లు వ్యతిరేక నిరసనలు
హింసాకాండ ప్రభావిత ప్రాంతాల్లో చమ్రగూడం, బెరెంగా, సిల్చార్‌లోని పాత లఖిపూర్ రోడ్డు ప్రాంతాలు ఉన్నాయి

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ బిల్లుపై నిరసనలు కొనసాగుతుండగానే, అస్సాంలోనూ అవే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. గతవారం పార్లమెంట్‌లో ఆమోదం పొందిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలోని కాచర్ జిల్లాలో జరిగిన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనల్లో ఒక వర్గం నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. సిల్చార్ పట్టణంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు గుంపులను చెదరగొట్టాయి. హింసాకాండ ప్రభావిత ప్రాంతాల్లో చమ్రగూడం, బెరెంగా, సిల్చార్‌లోని పాత లఖిపూర్ రోడ్డు ప్రాంతాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం ప్రారంభమైన నిరసన ర్యాలీ మొదట్లో శాంతియుతంగానే సాగింది. ఈ చట్టం ఇస్లాంకు వ్యతిరేకమని, దీనిని ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆ తర్వాత కొందరు యువకులు ర్యాలీలో చేరి పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. పరిస్థితిని గమనించిన పోలీసులు గుంపును చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. 'మొదట శాంతీయుతంగా చేపట్టిన ర్యాలీలో కొంతమంది ఆందోళనకారులు చేరి శాంత్రిభద్రతలకు విఘాతం సృష్టించేందుకు ప్రయత్నించారు. కానీ, తాము పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. సుమారు 300-400 మంది వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గుమిగూడారు. వారిపై చట్టప్రకారం అభియోగాలు ఉంటాయని ' కాచర్ పోలీస్ చీఫ్ నుమల్ మహతా వివరించారు. తాము శాంతియుతంగానే నిరసనలు చేపట్టామని, అయితే రాళ్లదాడికి తాము కారణం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ నిరసనకారుడు తెలిపాడు. వక్ఫ్ సవరణ చట్టం ఇస్లాంకు వ్యతిరేకం కాబట్టే నిరసనకు దిగాం. పోలీసుల తీరును వ్యతిరేకించట్లేదు, వారిపై రాళ్లను రువ్విన వారిపై చర్యలు తీసుకుంటే సంతోషిస్తామని సదరు నిరసనకార్డు స్పష్టం చేశాడు.






