- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : NRI లకు అమెరికా(USA) మరో బిగ్ షాక్ ఇవ్వనుంది. అమెరికా పౌరసత్వం(American Citizenship) లేని నాన్-రెసిడెంట్ ఇండియన్స్(NRIs) తమ సొంత దేశానికి పంపే డబ్బుపై 5% పన్ను విధించే ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును మే 12న హౌస్ రిపబ్లికన్లు "ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్" పేరుతో ప్రవేశపెట్టారు. ఇది H-1B వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ అప్లికెంట్లు, డాక్యుమెంట్ లేని వలసదారులు వంటి వారు విదేశాలకు పంపే అన్ని రెమిటెన్స్(Remittance)లపై వర్తిస్తుంది. భారతదేశం సంవత్సరానికి $83 బిలియన్ల రెమిటెన్స్‌లు అందుకుంటుంది, ఇందులో $33 బిలియన్లు అమెరికా నుంచి వస్తాయి. ఒక NRI ₹1 లక్ష పంపితే ₹5,000 పన్నుగా IRSకి వెళ్తుంది. ఈ పన్ను ఆదాయ పన్నుతో పాటు అదనంగా ఉండి డబుల్ టాక్సేషన్‌కు దారితీసే అవకాశం ఉంది.
బ్యాంకులు, వైర్ ట్రాన్స్‌ఫర్ సంస్థల ద్వారా ట్రాన్సాక్షన్ సమయంలో 5% కోత విధించబడుతుంది. అయితే ఈ బిల్లు ఇంకా చట్టం కాలేదు. మే 26న హౌస్‌లో ఓటింగ్ జరిగి జూలై 4 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ట్యాక్స్ క్రెడిట్ లేదా మినహాయింపులపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదని సమాచారం. ఈ పన్ను అమలైతే రియల్ ఎస్టేట్, విద్య, వైద్య ఖర్చుల కోసం తమ సొంత దేశానికి డబ్బు పంపే NRI లపై భారీగా భారం పడనుంది.






