- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
B-1B Lancer: బెంగళూరు ఎయిర్‌పోర్టులో అమెరికా ‘బీ–1బీ లాన్సర్’ బాంబర్
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ‘బీ–1బీ లాన్సర్’ బాంబర్ విమానం తాజాగా దర్శనమిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ‘బీ–1బీ లాన్సర్’ బాంబర్ విమానం తాజాగా దర్శనమిస్తోంది. ఈ బాంబర్ జెట్ ప్రజల దృష్టిని ఎంతో ఆకర్షిస్తోంది. ఈ భారీ బాంబర్ భారత్ - అమెరికా సంయుక్త వైమానిక విన్యాసాల (India–US Air Exercise) లో భాగంగా భారత్‌కు తీసుకొచ్చారు.
వైమానిక విన్యాసాలు.. రెండు దేశాల మధ్య వైమానిక దళాల మధ్య సమన్వయం, పరస్పర సహకారం, ఆపరేషనల్ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు. రెండు దేశాల మధ్య ఇలాంటి సంయుక్త వ్యాయామాలు రక్షణ రంగంలో వ్యూహాత్మక బంధాన్ని బలపరచడమే కాకుండా, భవిష్యత్ గ్లోబల్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు పరస్పర విశ్వాసం, సమన్వయాన్ని మరింతగా పెంచుతున్నాయని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో పార్క్ చేసి ఉన్న బాంబర్‌ను చూసి ప్రజలు తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు.
కాగా, భారత వైమానిక దళం ఆధ్వర్యంలో నవంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు భారత్ వేదికగా సైనిక విన్యాసాలు నిర్వహించారు. భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ సుఖోయ్-30 ఎంకేఐ, అమెరికా వైమానికి దళానికి చెందిన బాంబర్ బీ-1బీ లాన్సర్.. నిన్న సంయుక్తంగా సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. వీడియో ఇదే..






