- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
America: భారతీయులకు ట్రంప్ మరో షాక్.. తీవ్ర ఇబ్బందుల్లో అమెరికన్ కల !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానం కారణంగా వేలాది మంది భారతీయన్ల యూఎస్ కల చెదిరిపోతున్నట్టు కనిపిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తున్న వలస విధానం కారణంగా వేలాది మంది భారతీయన్ల యూఎస్ కల చెదిరిపోతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కీలకంగా మారుతున్నాయి. ఇటీవల యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ 2025 మేకి సంబంధించిన వీసా బులెటిన్‌ను విడుదల చేసింది. దీంతో హెచ్1బీ వీసా దారులు, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు షాక్ తగిలినట్టు అయింది. ఈ వీసా బులెటిన్ ప్రకారం.. గ్రీన్ కార్డు పొందడానికి దోహదపడే ఈబీ-5 అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ వీసా కోసం భారతీయుల కటాఫ్ తేదీని 2019 మే 1కి వాయిదా వేశారు. అదే టైంలో చైనాకు ఈ తేదీ 22 జనవరి 2014 వద్ద స్థిరంగా ఉంది. ‘భారత్ నుంచి ఈబీ-5 అన్‌రిజర్వ్‌డ్ వీసా కేటగిరీలకు అధిక డిమాండ్ ఉండటం, ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ పెరుగుతున్న వినియోగం కారణంగా ఈ వీసా కేటగిరీలను 2025 వార్షిక పరిమితిలోపు ఉంచడానికి వాయిదా వేయడం ఎంతో అవసరం’ అని యూఎస్ తన బులెటిన్ లో పేర్కొంది. దీంతో అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి భారీ షాక్ తగిలినట్టు అయింది.
గ్రీన్ కార్డ్ ధరఖాస్తులపై ప్రభావం?
భారతీయ గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులపై ఈబీ5 వీసా తిరోగమనం ప్రభావం చూపనుంది. గతంలో ఈ వర్గం భారతీయ పెట్టుబడిదారులు అర్హత కలిగిన యూఎస్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడితే ఆలస్యం లేకుండా గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించేది. కానీ ఇప్పుడు 2019 మే 1 కంటే ముందున్నవారు మాత్రమే కొనసాగగలరు. ప్రపంచవ్యాప్తంగా ఈబీ5 వీసాలు ఏడాదికి సుమారు 9,800గా పరిమితం చేశారు. ఒక్కో దేశానికి 7శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. దీంతో ఈ నిబంధన భారతీయులకు అడ్డంకిగా మారుతోంది. కాగా, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి అమెరికా ఫస్ట్ ఎజెండాతో దూసుకు పోతున్న విషయం తెలిసిందే.






