ఆగస్టు 1 నుంచి అమెరికా టారిఫ్‌లు అమలు.. బ్రిక్స్‌తో పొత్తు పెట్టుకుంటే అంతే..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-07 04:40:56  IST  )

భారత్‌‌తో పాటు కొన్ని దేశాలపై అమెరికా కొత్త వ్యాపార టారిఫ్‌లు విధించగా..

ఆగస్టు 1 నుంచి అమెరికా టారిఫ్‌లు అమలు.. బ్రిక్స్‌తో పొత్తు పెట్టుకుంటే అంతే..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌‌తో పాటు కొన్ని దేశాలపై అమెరికా కొత్త వ్యాపార టారిఫ్‌లు విధించగా.. వాటిని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. జులై 9నుంచి కొత్త టారిఫ్‌లు అమలవుతాయని గతంలో ప్రకటించిన అమెరికా.. ఆ గడువును మరికొన్నిరోజులు పొడిగించింది. ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. దీనివల్ల వాణిజ్య టారిఫ్‌లపై ఇతర దేశాలు అమెరికాతో చర్చలు జరిపేందుకు మరికొంత సమయం దొరికినట్లయింది.

మరోవైపు ట్రంప్ బ్రిక్స్ దేశాలతో పొత్తు పెట్టుకున్న దేశం అదనంగా 10 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. అమెరికా టారిఫ్ (America Tariff)ల చర్యలను ఖండిస్తూ బ్రిక్స్ (BRICS) ప్రకటన రిలీజ్ చేయగా.. దానిపై భారత్ సంతకం చేయడంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story