రేపట్నుంచి అమల్లోకి అదనపు సుంకాలు.. భారత్‌కు అమెరికా నోటీసులు

by Naga Rani Yarlagadda |

రేపటి నుంచి (ఆగస్టు 27) భారత్ పై అమెరికా విధించిన అదనపు సుంకాలు (America Tariffs on India) అమల్లోకి రానున్నాయి.

రేపట్నుంచి అమల్లోకి అదనపు సుంకాలు.. భారత్‌కు అమెరికా నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: రేపటి నుంచి (ఆగస్టు 27) భారత్ పై అమెరికా విధించిన అదనపు సుంకాలు (America Tariffs on India) అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో అమెరికా భారత్ కు నోటీసులు జారీ చేసింది. భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతోనే అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ భారత్ పై 25 శాతం అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులకు అదనపు సుంకాలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

అమెరికా వేసిన కొత్త సుంకాలు ఆగస్టు 27వ తేదీ అర్థరాత్రి 12.01 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసిన ఈ నోటీసులో.. ఆగస్టు 6న సంతకం చేయబడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు 14329ని సుంకాలు అమలు చేస్తున్నాయని పేర్కొంది.

Next Story