CPI leader Narayana : భారతీయ యువకులను వేధిస్తున్న అమెరికా : సీపీఐ నేత నారాయణ

by Y. Venkata Narasimha Reddy |

అమెరికా ప్రభుత్వం(US Government) ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్(Illegal Immigrants) పేరుతో భారతీయ యువకుల్ని(Indian Youth) జంతువుల్ని వేటాడినట్లుగా వేటాడుతూ వేధిస్తోందని(Hunted And Harassed Like An Animal) సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Leader Narayana)ఆరోపించారు.

CPI leader Narayana : భారతీయ యువకులను వేధిస్తున్న అమెరికా : సీపీఐ నేత నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా ప్రభుత్వం(US Government) ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్(Illegal Immigrants) పేరుతో భారతీయ యువకుల్ని(Indian Youth) జంతువుల్ని వేటాడినట్లుగా వేటాడుతూ వేధిస్తోందని(Hunted And Harassed Like An Animal) సీపీఐ సీనియర్ నేత నారాయణ(CPI Leader Narayana)ఆరోపించారు.

అమెరికా పర్యటనలో ఉన్న నారాయణ అమెరికన్ క్యాపిటల్ హిల్స్(పార్లమెంటు) భవనం ప్రాంగణం ముందు ఆయన మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను సమర్థించడం లేదని..అధ్యక్షుడు ట్రంప్ ముందే చెప్పారని..అయితే వారి పట్ల క్రూరత్వంతో కాకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. ట్రంప్, భారత ప్రధాని మోడీ భేటీ పిదప కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్ల అమెరికా వేధింపులు కొనసాగడం విచారకరమన్నారు.

మోడీ వచ్చినప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేంట్స్ ఉంటే చెప్పండి తీసుకెళ్తం అని కనీసం ట్రంప్ కి సర్థి చెప్పలేకపోయారని..వారిద్ధరు కలిసినప్పుడు కూడా ఈ విషయంపై మాట్లాడుకోలేదని..దీంతో ఆ తర్వాత రోజు నుంచి మళ్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను వేటాడే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా వాళ్లకు కావాల్సిన ప్రాసెస్ చేసుకొని పంపించాలి కానీ వేటాడడం ఎందుకని..ఈ చర్యలతో యువకులు వారి జీవితాలు దెబ్బతిని డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు. అమెరికా ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్ల అమానుషంగా వ్యవహరించడం దారుణమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని నారాయణ స్పష్టం చేశారు.

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో చెప్పినట్లుగానే ఆ దేశంలోని వివిధ దేశాల అక్రమవలసదారులను వారి దేశాలకు బలవంతంగా తిప్పిపంపిస్తోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తించేందుకు వారిని అన్వేషిస్తూ..అదుపులోకి తీసుకుంటూ..వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి మరి ప్రత్యేక విమానాల్లో వారి దేశాలకు పంపిస్తున్న తీరు బాధిత వలసదారుల దేశాలలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.


Next Story