America: దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే జైలు శిక్ష తప్పదు.. అమెరికా ఎంబసీ వార్నింగ్

by B.Srinivas |

అక్రమ వలసదారులపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

America: దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే జైలు శిక్ష తప్పదు.. అమెరికా ఎంబసీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అక్రమ వలసదారులపై ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించే వారికి జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చింది. అంతేగాక జైలు శిక్షతో పాటు బహిష్కరణ వేటు, శాశ్వతంగా వీసా పొందడానికి సైతం అనర్హులవుతారని తెలిపింది. సరైన పత్రాలు లేకుండా యూఎస్‌లోకి ప్రవేశిస్తే స్వదేశానికి తిప్పి పంపిస్తామని, పర్మినెంట్ గా మరోసారి యూఎస్ రాకుండా చేస్తామని పేర్కొంది. ఈ మేరకు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘యూఎస్ లోకి అక్రమంగా చొరబడిన వారిపై తీసుకునే చర్యలను ముమ్మరం చేసింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తే నిర్భంధం, బహిష్కరణ భవిష్యత్ లోనూ శాశ్వతంగా వీసాకు అర్హత కోల్పోతారు’ అని తెలిపింది. అధికంగా డబ్బు ఖర్చు పెట్టుకుని అక్రమ మార్గాల్లో వచ్చినా ఇవే చర్యలుంటాయని స్పష్టం చేసింది. అంతకుముందు రాయబార కార్యాలయం మరో ప్రకటనలో యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రైవసీని తొలగించాలని తెలిపింది.

Next Story