- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతీయులకు అమెరికా ఎంబసీ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే వీసా రాదు
వీసా గడువు తీరినా.. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్నవారికి భారత్ లోని అమెరికా ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వీసా గడువు తీరినా.. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్నవారికి భారత్ లోని అమెరికా ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా పర్మిషన్ పూర్తయ్యాక కూడా అమెరికాలో ఉంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. వెకేషన్, విద్యార్థి, వర్క్ పర్మిట్ సహా.. పలు రకాల వీసాలపై అమెరికాలో ఉంటోన్న ఇండియన్స్ ను ఉద్దేశించి అమెరికా ఎంబసీ ఈ హెచ్చరిక జారీ చేసింది. యూఎస్ వీసా గడువు నిబంధనలను గౌరవించాలని, కాదని ఉల్లంఘిస్తే వీసా రద్దుతో పాటు బహిష్కరణకు గురికావొచ్చని తెలిపింది. అలాగే ఫ్యూచర్లో వీసా రాకుండా అనర్హత వేటు కూడా పడొచ్చని పేర్కొంది.
కాగా.. అమెరికాలో ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చింది మొదలు.. వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలాగే వీసా నిబంధనల్లోనూ మార్పులు చేశారు. బిజినెస్, టూరిస్ట్ వీసా కోసం అప్లై చేసుకునేవారు షూరిటీ కింద 15 వేల డాలర్లు బాండ్ కు చెల్లించాలని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతిపాదించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.13 లక్షలు. గడువు పూర్తయ్యాక ఆ మొత్తాన్నీ రీఫండ్ చేస్తారు. వీసా గడువు తీరాక అక్కడే ఉంటే.. ఎలాంటి రీఫండ్ రాదు.






