America: అలా చేస్తే విదేశీ అధికారుల వీసా రద్దు.. అమెరికా వార్నింగ్

by B.Srinivas |

అమెరికన్ టెక్ కంపెనీలు నిర్వహిస్తున్న సోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేసే విదేశీ అధికారుల వీసాలు రద్దు చేస్తామని మార్కో రూబియో హెచ్చరించారు.

America: అలా చేస్తే విదేశీ అధికారుల వీసా రద్దు.. అమెరికా వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికన్ టెక్ కంపెనీలు నిర్వహిస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోని పోస్టులను బ్లాక్ చేసే విదేశీ అధికారుల వీసాలు రద్దు చేస్తామని యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) హెచ్చరించారు. అమెరికాలో భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించేవారికి లేదా సామాజిక మాధ్యమాల్లో అమెరికన్ పౌరుల పోస్టింగ్‌లను సెన్సార్ చేసే వారికి ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు. అలాంటి ఆఫీసర్లను తమ దేశానికి రానివ్వబోమని స్పష్టం చేశారు. ఒక అమెరికన్ పౌరుడు యూఎస్ నుంచి ఏదైనా పోస్ట్ చేస్తే, అది అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ ఆ పోస్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసే హక్కు ఏ దేశానికీ లేదన్నారు. అమెరికాలో ఉంటూ అమెరికన్ పౌరులను అరెస్టు చేస్తామని విదేశీ అధికారులు బెదిరించడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఈ తరహా చర్యలను సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. అయితే రూబియో ప్రత్యక్షంగా ఏ దేశం పేరు చెప్పకపోయినా లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు ఈ పరిధిలో ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు.

Next Story