కోరుకుంటే శాంతి లేదంటే..ఇరాన్‌కు అమెరికా మరో వార్నింగ్

by Ajay Maddhiboyina |

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైతం ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇరాన్ అణుస్థావ‌రాల‌పై అమెరికా మిస్సైల్స్ దాడులు చేశాయి.

కోరుకుంటే శాంతి లేదంటే..ఇరాన్‌కు అమెరికా మరో వార్నింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైతం ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇరాన్ అణుస్థావ‌రాల‌పై అమెరికా మిస్సైల్స్ దాడులు చేశాయి. అయితే ఆ దాడుల‌కు ప్ర‌తిగా ఇప్ప‌టి వ‌ర‌కు ఇరాన్ అమెరికాపై దాడులు చేయ‌లేదు. కాగా తాజాగా అమెరికా మ‌రోసారి ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. అమెరికా విదేశాంగమంత్రి మార్కొ రుబియో మాట్లాడుతూ.. ఇరాన్ నిర్ణయాన్ని భట్టే అమెరికా కార్యాచరణ ఉంటుందని అన్నారు. ఇరాన్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటే దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

లేదు ఏదైనా చేస్తామని అనుకుంటే వారి పరిస్థితి దుర్భరంగా మారుతుందని హెచ్చరించారు. కనీసం సొంత గగన తలాన్ని కూడా రక్షించుకోలేరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇచ్చే దేశాలపై దాడులకు పాల్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ మూడో ప్రపంచయుద్ధానికి దారి తీసే అవకాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్‌‌కు అమెరికా మద్దతివ్వగా ఇరాన్‌కు అండగా రష్యా, చైనా నిలుస్తున్నాయి.

Next Story