చిన్నారి ప్రాణం కాపాడేందుకు తన ప్రాణాన్నే రిస్క్‌లో పెట్టిన అంబులెన్స్ సిబ్బంది.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వర్షాల కారణంగా జరుగుతున్న ప్రమాదాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల్లో ఇల్లు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం జరుగుతోంది.

చిన్నారి ప్రాణం కాపాడేందుకు తన ప్రాణాన్నే రిస్క్‌లో పెట్టిన అంబులెన్స్ సిబ్బంది.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వర్షాల కారణంగా జరుగుతున్న ప్రమాదాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల్లో ఇల్లు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలోనూ అత్యవసర విభాగాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొండచరియలు విరిగిపడుతున్నా లెక్క చేయకుండా ఓ అంబులెన్స్ సిబ్బంది ఏడు నెలల చిన్నారి ప్రాణాలను కాపాడాడు. చంబా జిల్లాలో ఓ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ ను పిలిపించారు.

అయితే మార్గమధ్యలో కొండచరియలు విరిగిపడటంతో ఆ అంబులెన్స్ ఆగిపోయింది. దాంతో వెంటనే మరో అంబులెన్స్ ను రప్పించారు. అయితే అంబులెన్స్ నుండి మరో అంబులెన్స్ కు మారే సమయంలో పై నుండి రాళ్లు పడుతున్నా లెక్క చేయకుండా చిన్నారిని హత్తుకు అంబులెన్స్ సిబ్బంది మరో అంబులెన్స్ వద్దకు పరిగెత్తాడు. సురక్షితంగా చిన్నారిని మరో అంబులెన్స్ లో చేర్పించాడు. ప్రస్తుతం దీనికి సంబంధిచిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story