- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ambedkar Statue Vandalized : అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. పోలీసుల 144 సెక్షన్
మధ్యప్రదేశ్(MP) లో అంబేద్కర్ విగ్రహ ధ్వంసం(Ambedkar Statue Vandalized) తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్(MP) లో అంబేద్కర్ విగ్రహ ధ్వంసం(Ambedkar Statue Vandalized) తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని శివపురి(Shivapuri) జిల్లాలోని పిచ్చోర్ పట్టణంలో బరేలా తిరాహలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ విగ్రహం ఇప్పటికే మూడుసార్లు ధ్వంసం చేయగా.. ఇది నాల్గవ సంఘటన. సోమవారం ఉదయం విగ్రహం యొక్క ఒక వేలు దెబ్బతినడం గమనించిన స్థానికులు.. భీమ్ ఆర్మీ కార్యకర్తలతో సహా భారీ నిరసనకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని... ఘటనపై విచారణ చేపట్టారు. కాగా నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ధర్నాకు దిగగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు 144 విధించిన ఉన్నతాధికారులు, భారీగా భద్రతా బలగాలను మోహరించారు.






