- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amarnath Yatra: అమర్ నాథ్ యాత్ర ఎప్పట్నుంచి ప్రారంభం కానుందంటే?
మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జులై 3 నుంచి ప్రారంభం కానుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: మహా శివుడికి ప్రతిరూపమైన సహజసిద్ధ మంచు శివలింగాన్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జులై 3 నుంచి ప్రారంభం కానుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. 39 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర రక్షాబంధన్ పండుగ రోజు ముగియనుంది. అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. బోర్డు ఛైర్మన్‌గా ఉన్న జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన సమావేశం జరగగా.. ఆ తర్వాత యాత్ర తేదీలను ఖరారు చేశారు. అమర్ నాథ్ యాత్ర తేదీలు ఖరారు కావడంతో, అధికారులు ఇప్పుడు తీర్థయాత్రకు సజావుగా ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించారు. అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాబోయే నెలల్లో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం సౌకర్యాలు ఉంటాయని వెల్లడించారు. కాగా.. యాత్రకు భారీగా భక్తులు పోటెత్తనున్నారు. దీంతో, భద్రత, వైద్యసేవలు సహా లాజిస్టికల్ ఏర్పాట్లకు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. యాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినందున భక్తులు అధికారిక మార్గదర్శకాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






