- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం: రోడ్డు పక్కకు దూసుకెళ్లిన అమర్‌నాథ్ యాత్రికుల బస్సు
అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న వేగవంతమైన బస్సు, ఓ మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు దాటి పక్కనే ఉన్న ఇంటిపైకి దూసుకెళ్లింది.

దిశ, వెబ్ డెస్స్: అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ షాకింగ్ సంఘటన జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లా కంగన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అమర్‌నాథ్ యాత్రికుల (Amarnath pilgrims)తో వెళ్తున్న బస్సు, ఓ మూల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం తో రోడ్డు దాటి పక్కనే ఉన్న ఇంటి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు యాత్రికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఆ ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అది అడ్డంగా నిలవడంతో బస్సు పక్కనే ఉన్న సింధ్ నదిలో పడిపోకుండా ఆగిపోయి పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. బస్సులోని యాత్రికులలో అత్యధికులకు స్వల్ప గాయాలయ్యాయని, వెంటనే స్థానికులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాధితులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారని అధికారులు వెల్లడించారు






