- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియా పాక్ వార్.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్న 71ఏళ్ల మాజీ సైనికుడు
పహల్గామ్ ఎటాక్ తరవాత భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ మేగాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి దేశానికి సేవ చేసేందుకు రిటైడ్ కెప్టెన్ అమర్‌జిత్ కుమార్(71) ముందుకు వచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఎటాక్ తరవాత భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధ మేగాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి దేశానికి సేవ చేసేందుకు రిటైడ్ కెప్టెన్ అమర్‌జిత్ కుమార్(71) ముందుకు వచ్చారు. 1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధంలో తాను పాల్గొన్నట్టు తెలిపారు. సైనికుడికి రిటైర్మెంట్ ఉండని ఆయన చెబుతున్నారు. రాజకీయ నాయకులకు ఎలాగైతే రిటైర్మెంట్ ఉండదో తమకు కూడా అలానే అని చెప్పారు.
తిరిగి ఆర్మీలో చేరేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి లేఖ రాసినట్టు చెప్పారు. దేశం కోసం ఎక్కడ పనిచేయడానికి అయినా తాను సిద్ధమే అని తెలిపారు. గతంలో యుద్ధం పాల్గొన్న ప్రత్యక్ష అనుభవం ఉన్న తమను వినియోగించుకోవాలని సూచించారు. 26ఏళ్ల పాటూ తాను సైన్యంలో సేవలు అందించినట్టు చెప్పారు. తన వయసు 71 ఏళ్లు అయినా తాను మెంటల్లీ ఫిజికల్లీ ధృడంగా ఉన్నట్టు చెప్పారు. తనతో పాటూ కలిసి పనిచేసిన మరో 223 మంది మాజీ సైనికులు కూడా తిరిగి ఆర్మీలో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.






