- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైనికులకు సోషల్ మీడియా అనుమతి : ఆర్మీ కీలక నిర్ణయం
త్రివిధ దళాల సైనికులు సోషల్ మీడియా వాడటంపై భారత రక్షణశాఖ తాజాగా కొన్ని నిబంధనలు సడలించింది.

దిశ, వెబ్ డెస్క్ : త్రివిధ దళాల సైనికులు సోషల్ మీడియా వాడటంపై భారత రక్షణశాఖ తాజాగా కొన్ని నిబంధనలు సడలించింది. తాజా రూల్స్ ప్రకారం జవాన్లు, సైనికాధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం వీక్షించేందుకు మాత్రమే ఉపయోగించుకోవచ్చని.. పోస్టులు చేయడం, కామెంట్లు పెట్టడం, షేరింగ్ చేయడం, మెసేజ్‌లకు రియాక్ట్ కావడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేసింది. తప్పుదారి పట్టించే ఫేక్ న్యూస్ ఏదైనా కనిపిస్తే వెంటనే సీనియర్ అధికారులకు తెలియజేయాలని సూచించింది. వీపీఎన్‌లు, నకిలీ వెబ్‌సైట్లు, వెబ్ ప్రాక్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించొద్దని హెచ్చరించింది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి ఇతర మాధ్యమాలకు కూడా ఇదే విధమైన పరిమితులు కొనసాగుతాయని తెలిపింది. అయితే 2020లో హనీట్రాప్‌లు, రహస్య సమాచార లీక్ ఘటనల నేపథ్యంలో 89 యాప్‌లపై రక్షణశాఖ నిషేధం విధించింది. ప్రస్తుతం కొన్ని యాప్‌లను పాక్షికంగా వినియోగించేందుకు మాత్రమే అనుమతినిచ్చింది.






