మీకు మాకు చెరో 101 సీట్లు.. బిహార్ ఎన్డీయే సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-10-12 13:26:18  IST  )

హార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది.

మీకు మాకు చెరో 101 సీట్లు.. బిహార్ ఎన్డీయే సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar elections) కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు (NDA seat sharing) కుదిరింది. ఇక్కడ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ, జేడీయూకు చెరో 101 సీట్లు కేటాయించారు. కూటమిలోని పార్టీలైన ఎల్ జేపీ (రాంవిలాస్)కి 29, రాష్ట్రీయ లోక్ మోర్చ-6, హిందూస్తానీ అవామ్ మోర్చా-6 సీట్లు కేటాయించారు. ఈ మేరకు సీట్ల సర్దుబాటు అంశాన్ని ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్సి వినోద్ తావ్డే అధికారికంగా ప్రకటించింది. కూటమిలోని పార్టీల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సీట్ల పంపకాన్ని పూర్తి చేశామని సమిష్టిగా బిహార్ లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అయితే తమకు కనీసం 15 స్థానాలు ఇవ్వాలని పట్టుబట్టిన హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చా అధినేత మాజీ సీఎం జితన్‌ రామ్‌ మాంఝీ షాక్ తగిలింది. ఈ పార్టీకి కేవలం 6 స్థానాలు మాత్రమే దక్కాయి. మమల్ని అవమానించవద్దని మేమేమి ముఖ్యమంత్రి సీటు కోరడం లేదు. మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయిస్తే చాలు అని ఇటీవల మాంఝీ అన్నారు. కానీ చివరకు కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు.

Next Story