- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tamilanadu: మతం కాదు, ఎన్డీయే కూటమే ప్రమాదంలో ఉంది: ఎంకె స్టాలిన్
ప్రజలను ఆకట్టుకునేందుకు మిస్డ్ కాల్ వంటి జిమ్మిక్కులు చేస్తున్నారని, అది కుదరకపోతే దేవుడి పేరుమీద రాజకీయాలు చేస్తున్నారు

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీజేపీ, ఏఐఏడీఎంకేలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మతం ప్రమాదంలో ఉందని పదేపదే చెబుతూ రాష్ట్ర ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గురువారం మధురైలో జరిగిన మురుగన్ సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు కులం, మతం పేరుతో తమిళనాడు ప్రజలను విభజించాలని చూస్తున్నారు. వారు విఫలమైతే అన్నా డీఎంకే ద్వారా అదే ప్రక్రియను అనుసరిస్తున్నారు. డీఎంకే పార్టీ జాతీయ, ప్రజలకు సంబంధించిన అంశాలను ముందుకు తెస్తుంటే, కమలం, ఏఐఏడీఎంకే పార్టీలు మతం ఆధారంగానే పనిచేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో మతానికెలాంటి ప్రమాదం లేదని, బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమే ప్రమాదంలో ఉందన్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు కూటమి మిస్డ్ కాల్ వంటి జిమ్మిక్కులు చేస్తున్నారని, అది కుదరకపోతే దేవుడి పేరుమీద రాజకీయాలు చేస్తున్నారు. అయితే, తమిళనాడు ప్రజలు పెరియార్ నడయాడిన భూమి ఇది. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి చేసే నకిలీ భక్తికి పడిపోరని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మతాలకు అనుగుణంగా డీఎంకే ప్రభుత్వం సంక్షేమాన్ని అందిస్తోంది. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలోన్ 3 వేలకు పైగా దేవాలయాలకు కుంభాభిషేకం చేయించి ఆలయాల ప్రతిష్టను పెంచామన్నారు. చర్చిలు, మసీదుల అభివృద్ధి కోసం రూ. 84 కోట్లు ఖర్చు చేశాం. అయితే, దీన్ని మత రాజకీయాలు చేస్తున్నవారు సహించలేకపోతున్నారు. ఎన్డీఏ కూటమిని ఇప్పుడు నిలువరించకపోతే, రానున్న రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా కుల, మత చిచ్చు ద్వారా అధికారంలో వస్తారు. వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రాలపై భారం పడే విధంగా రూపొందించారని ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి నిధులు కూడా ఇవ్వడంలేదని విమర్శించారు.






