Allegations: భారత్‌ను అస్థిరపరిచేందుకు ఎలాంటి కుట్ర లేదు.. బీజేపీ ఆరోపణలపై యూఎస్ స్పందన

by B.Srinivas |

మోడీ, అదానీలే టార్గెట్‌గా అమెరికా విదేశాంగ శాఖ, ఇతర సంస్థలు భారతదేశాన్ని అస్థిర పర్చేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ చేసిన ఆరోపణలపై యూఎస్ స్పందించింది.

Allegations: భారత్‌ను అస్థిరపరిచేందుకు ఎలాంటి కుట్ర లేదు.. బీజేపీ ఆరోపణలపై యూఎస్ స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi), పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ (Gowtham adhani)లే టార్గెట్‌గా చేసుకుని అమెరికా విదేశాంగ శాఖ, ఇతర సంస్థలు భారతదేశాన్ని అస్థిర పర్చేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ చేసిన ఆరోపణలపై యూఎస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ వ్యాఖ్యలను పూర్తిగా తోసిపుచ్చింది. అధికార పార్టీ ఆరోపణలు తీవ్ర నిరాశను కలిగించాయని తెలిపింది. తమ దేశ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛను సమర్థిస్తోందని పేర్కొంది. జర్నలిస్టుల వృత్తిపరమైన అభివృద్ధి, శిక్షణను ప్రోత్సహించే ప్రణాళికలపై యూఎస్ ప్రభుత్వం స్వతంత్ర సంస్థలతో కలిసి పనిచేస్తుందని, అయితే ఈ సంస్థల సంపాదకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడం దీని ఉద్దేశం కాదని ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ ప్రతినిధి తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్దతిస్తోందని, స్వేచ్ఛ, నిష్పక్షపాత మీడియా ప్రజాస్వామ్యంలో కీలకమైన భాగమని పేర్కొన్నారు. ప్రజలకు తెలియజేయడం, నిర్మాణాత్మక చర్చను ప్రోత్సహించడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం మీడియా కర్తవ్యమని తెలిపారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. కాగా, అమెరికా డీప్ స్టేట్ మీడియా పోర్టల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్(OCCRP), కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul gandhi)తో కలిసి భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపించింది. అదానీ గ్రూప్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉందని ఆరోపించేందుకు ఓసీసీఆర్‌పీ నివేదికను ఉపయోగించిన రాహుల్ ప్రకటనలను బీజేపీ ఎత్తి చూపింది. ఈ ఆరోపణలపైనే యూఎస్ స్పందించింది.

Next Story