- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన కామెంట్లకు సంబంధించి లక్నో కోర్టు సమన్లను జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం నేడు విచారించింది. రాహుల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.
వాక్ స్వాతంత్య్రం హక్కులో ఏ వ్యక్తికైనా, సైన్యానికి అయినా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసే స్వేచ్చ లేదని స్పష్టం చేసింది. భవిష్యత్ లో సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఇదిలా ఉంటే 2022లో భారత్ జోడో యాత్రలో రాహుల్ మాట్లాడుతూ.. చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీపై దాడులు చేస్తున్నారు. సైనికులను కొడుతున్నారు. చైనా 2000 కీలో మీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించి, 20 మంది భారత సైనికులను చంపేసింది. అంటూ రాహల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై లక్కోలోని ఓ కోర్టులో ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.






