శ్రీకృష్ణ జ‌న్మ‌భూమి వివాదంలో కీల‌క మ‌లుపు

by Ajay Maddhiboyina |

శ్రీ కృష్ణ జ‌న్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. మ‌థుర‌లోని కృష్ణ జ‌న్మ‌భూమి ఆల‌యంలోని షాహీ ద‌ర్గాను భ‌విష్య‌త్‌లో

శ్రీకృష్ణ జ‌న్మ‌భూమి వివాదంలో కీల‌క మ‌లుపు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ కృష్ణ జ‌న్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. మ‌థుర‌లోని కృష్ణ జ‌న్మ‌భూమి ఆల‌యంలోని షాహీ ద‌ర్గాను భ‌విష్య‌త్‌లో జ‌రిగే అన్ని న్యాయ ప్ర‌క్రియ‌ల్లో అధికారికంగా వివాదాస్ప‌ద క‌ట్ట‌డంగా ప్ర‌క‌టించాల‌ని ముక్తి న్యాస్ అధ్యక్షుడు మహేంద్ర ప్రతాప్ సింగ్ దాఖ‌లు చేసిన ఓ పిటిష‌న్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఈ పిటిషన్‌ను విచారించగా కోర్టు పరిశీలనలో ఉన్న దాని గురించి అలాంటి ప్రకటన చేయడం తీర్పును అంచనా వేయడమే అవుతుందని స్పష్టం చేశారు. పూర్తి విచారణకు ముందు మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించడం తుది తీర్పుపై ప్రభావం చూపిస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ముస్లీం సంఘాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. కృష్ణ జ‌న్మభూమి వివాదంలో ఇతర పిటిషన్‌ల పై విచారణ సాగుతుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ వివాదానికి సంబంధించి మొత్తం 18 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Next Story