- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ahmedabad Plane Crash : విమాన ప్రమాదం.. ప్రయాణికులంతా మృతి
దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లో నేడు ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరగగా.. వీరిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు.

దిశ, వెబ్ డెస్క్: దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మృతిచెందారు. ప్రమాద సమయంలో 242 మంది ఉండగా.. అందరూ మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ కమిషనర్ సహా గుజరాత్ హెల్త్ సెక్రటరీ నిర్ధారించారు. మరోవైపు ప్రమాద సమయంలో విమానంలో ఉన్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former CM Vijay Rupani) కూడా మృతిచెందారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒక కెనడా వాసి, 12 మంది సిబ్బంది ఉన్నారు. అంతేగాకుండా.. ఇద్దరు శిశువులు సహ 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద తీవ్రతతో ప్రయాణికులు మాంసాపు ముద్దాలుగా మారారు. ఘటనాస్థలిలో తెగిపడిన శరీర భాగాలు, గుర్తు పట్టలేనంత కాలిన దేహాలతో భీతావాహంగా ఉంది. మృతులను డీఎన్ఏ టెస్టు ద్వారా గుర్తించి బంధువులకు అప్పగిస్తామని గుజరాత్ హెల్త్ సెక్రెటరీ ద్వివేది పేర్కొన్నారు.






