ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం.. విపక్షాలకు కేంద్రం కీలక విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ భవన్ లో ప్రారంభమయింది.

ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం.. విపక్షాలకు కేంద్రం కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ భవన్ లో ప్రారంభమయింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవ్వనుండగా.. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరింది. కాగా.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో SIR, వందేమాతరం వివాదం పై అధికార, విపక్షాలు కీలకంగా చర్చించనున్నాయి.

మరోవైపు ఏపీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ సమావేశాల్లో డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఇవ్వాలని టీడీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు విజ్ఞప్తి చేయనున్నారు. వీటితో పాటు అణుఇంధన బిల్లు, కార్పొరేట్ చట్టసవరణ బిల్లు, సెక్యూరిటీ కోడ్ బిల్లు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది.

Next Story