- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన అఖిలపక్ష సమావేశం... శీతాకాల సమావేశాలకు సిద్ధం
ఢిల్లీలో నేడు రెండున్నర గంటల పాటు జరిగిన ఆల్ పార్టీ సమావేశం ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలో నేడు రెండున్నర గంటల పాటు జరిగిన ఆల్ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిసెంబర్ 1 నుంచి 19 వరకు 15 రోజుల పాటు సాగే శీతాకాల సమావేశాలు సజావుగా నడిచేలా విపక్షాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. విపక్షాలు SIR (వోటర్ లిస్ట్ రివిజన్), ఢిల్లీ బ్లాస్ట్, ఆర్థిక సమస్యలు, బెంగాల్-జమ్మూ కాశ్మీర్ హింస, పొల్యూషన్ వంటి అంశాలను లేవనెత్తగా, ప్రభుత్వం ఈ సెషన్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లుల జాబితాను (ఆటమిక్ ఎనర్జీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్, కార్పొరేట్ లా అమెండ్‌మెంట్, ఇన్సూరెన్స్ అమెండ్‌మెంట్, సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ మొదలైనవి) అందజేసింది. ఈ సమావేశం సజావుగానే జరిగినప్పటికీ, విపక్షాలు కొన్ని ముఖ్య అంశాలపై గట్టి పోరాటం చేస్తామని సూచించడంతో రాబోయే వింటర్ సెషన్ వాడీ వేడీగా ఉండవచ్చని అంచనా వినిపిస్తోంది.






