- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అత్యంత కీలక సమావేశం.. అమిత్ షా, రాహుల్ గాంధీ హాజరు
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడి(Terrorist Attack) నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం అత్యంత కీలక సమావేశం ఏర్పాటు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లోని పెహల్గాం ఉగ్రదాడి(Terrorist Attack) నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం అత్యంత కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అధ్యక్షతన రాజకీయ ఏకాభిప్రాయానికి అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi), జేపీ నడ్డా, జై శంకర్‌లు హాజరయ్యారు. ఉగ్రదాడి అనంతర చర్యలపై అభిపక్షానికి కేంద్ర పెద్దలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది. ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైతం భారత విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇరుదేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అంతకుముందు అమిత్ షా, జైశంకర్‌లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను ఆమెకు వివరించారు.






