USA Flight Accident : వారంతా మృతి చెందారు : అమెరికా

by Muthe.Rajitha |   (  Updated:2025-01-30 16:14:44  IST  )

అమెరికా(USA)లో ఓ మిలటరీ హెలికాప్టర్(Military Helicopter)ను ప్యాసింజర్ ఫ్లైట్(Passenger Flight) ఢీకొట్టిన సంగతి తెలిసిందే.

USA Flight Accident : వారంతా మృతి చెందారు : అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా(USA)లో ఓ మిలటరీ హెలికాప్టర్(Military Helicopter)ను ప్యాసింజర్ ఫ్లైట్(Passenger Flight) ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 64 మంది ప్రయాణికులు, హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు ఉండగా.. వారంతా మరణించినట్లు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి. వారిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని స్పష్టం చేశాయి. ఇప్పటివరకు విమానంలోని 27 మంది, హెలికాప్టర్లో ఒక మూతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాల వెలికితీత కార్యక్రమం కొనసాగుతోంది. కాగా యూఎస్ఏ లోని వర్జీనియా(Virginia) రాష్ట్రంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం (Ronald Reagan Washington National Airport) నుంచి ఫ్లైట్ సిబ్బందితో సహా మొత్తం 64 మందితో ఓ విమాన ల్యాండ్ అవుతోంది. ఈ క్రమంలో ఫ్లైట్ పోటోమాక్ నది(Potomac River) సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ మిలటరీ హెలికాప్టర్ ఆ ప్యాసింజర్ ఫ్లైట్‌ ను బలంగా ఢీకొట్టింది.

దీంతో భారీ పేలుడు సంభవించి, విమానం, హెలికాప్టర్ పొటోమాక్ నదిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు (Ronald Reagan Airport) ల్యాండింగ్‌ ట్రాక్‌కు సమీపంలోనే విమానం కూలిపోయిందని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ మేరకు వాషింగ్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ (Washington Fire Department) ఫైర్ బోట్లతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతోంది. ఈ ప్రమాదం కారణంగా రీగన్ నేషనల్‌ పరిధిలోని అన్ని విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే, విమానం కూలిపోవడానికి గల కారణాలేంటనే విషయం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అదేవిధంగా రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్ నుంచి అన్ని విమానాల టేకాఫ్స్ (Take Offs), ల్యాండింగ్స్‌ (Landings)‌ను పూర్తి నిలిపివేశారు. ఎయిర్‌ ఫీల్డ్‌ (Air Field) విమానం కూలిన ఘటనపై ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా ఫ్లైట్ యాక్సిడెంట్‌కు సంబంధించి ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


READ MORE ...

గాల్లోనే ఢీకొన్న విమానం, హెలికాప్టర్.. ఎవ్వరూ బతికే ఛాన్స్ లేదు!


Next Story