- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేలు అందరికీ ఫ్రీగా ఐఫోన్లు, ఐప్యాడ్స్
ఢిల్లీ ఎమ్మెల్యేలు అందరికీ ఫ్రీ ఐఫోన్ 16 ప్రో, ఐప్యాడ్, ట్యాబెట్ల్స్ అందించింది ప్రభుత్వం. సీఎం రేఖా గుప్తాతో సహా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 70మందికి పేపర్‌లెస్ గవర్నెన్స్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ కింద ఫోన్లు అందించబడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎమ్మెల్యేలు అందరికీ ఫ్రీ ఐఫోన్ 16 ప్రో, ఐప్యాడ్, ట్యాబెట్ల్స్ అందించింది ప్రభుత్వం. సీఎం రేఖా గుప్తాతో సహా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 70మందికి పేపర్‌లెస్ గవర్నెన్స్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ కింద ఫోన్లు అందించబడ్డాయి. ‘వన్ నేషన్, వన్ అప్లికేషన్’ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే శాసన సభ్యులకు డిజిటల్ ఇంటర్‌ఫేస్ శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇందులో భాగంగా రియల్ టైమ్ డాక్యుమెంట్ యాక్సెస్, స్మార్ట్ డెలిగేట్ యూనిట్స్, RFID/NFC సెక్యూర్ యాక్సెస్, మల్టీలాంగ్వేజ్ సపోర్ట్‌పై వివరణ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విధానంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లు, స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధిని వదిలేసి.. ఐఫోన్ల వాడకం అంటూ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని.. ఇది మేక్ ఇన్ ఇండియాకు విరుద్ధం కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అయితే సపోర్టర్స్ మాత్రం పేపర్ లెస్ విధానం వల్ల ఏటా రూ. 17కోట్లు ఆదా అవుతాయని.. పారదర్శకత పెరుగుతుందని చెప్తున్నారు.






