Indian Embassy: ఇజ్రాయెల్‌లో భారతీయులందరూ సురక్షితం: భారత మిషన్

by S Gopi |

తమ పౌరుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తోందని భారత మిషన్ ఆదివారం అధికారిక ప్రకటనలో తెలిపింది.

Indian Embassy: ఇజ్రాయెల్‌లో భారతీయులందరూ సురక్షితం: భారత మిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఆ రెండు దేశాల్లో నివశించే భారత పౌరులపై ఆందోళన పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారతీయులందరూ సురక్షితంగా ఉన్నారని, ఇరాన్‌తో వివాదం నేపథ్యంలో రాయబార కార్యాలయం పరిస్థితిని, తమ పౌరుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తోందని భారత మిషన్ ఆదివారం అధికారిక ప్రకటనలో తెలిపింది. 24 గంటల పాటు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసి, మన దేశ పౌరులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. స్థానిక పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, భారత పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొంది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ కుటుంబాలతో పాటు విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు సహా అందరూ టెల్ అవీవ్‌లో ఉన్న రాయబార కార్యాలయం కాంటాక్ట్‌లో ఉందని, స్థానిక అధికారులతో అనుక్షణం సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన నేపథ్యంలో భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనవర ప్రయాణలు చేయవద్దని భారత రాయబార కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story