ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమిత్‌ షాకు AIGF లేఖ

by Naga Rani Yarlagadda |

ఆన్లైన్ బెట్టింగ్ ను అరికట్టేందుకు.. కేంద్రప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లు (online gaming bill)ను అమల్లోకి తీసుకురానుంది. నేడు ఈ బిల్లును లోక్ సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమిత్‌ షాకు AIGF లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఆన్లైన్ బెట్టింగ్ ను అరికట్టేందుకు.. కేంద్రప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లు (online gaming bill)ను అమల్లోకి తీసుకురానుంది. నేడు ఈ బిల్లును లోక్ సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. బెట్టింగ్ లతో నడిచే అన్ని ఆన్లైన్ గేమింగ్ లపై నిషేధం పడుతుంది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్ పై నిషేధం విధించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా కు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. ఆన్లైన్ గేమింగ్ పై నిషేధం విధిస్తే తమ రంగం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కోట్లాదిమంది ఆన్లైన్ గేమర్లు.. జూదానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.

కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ అండ్ ప్రమోషన్ చట్టం ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.. రియల్ మనీ ఆన్లైన్ గేమ్స్ కోసం వచ్చే రిక్వెస్ట్ లను ప్రాసెస్ చేసేందుకు, మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు అనుమతించవు. రియల్ మనీ గేమింగ్‌ను ప్రోత్సహించే ప్రకటనలపై పూర్తి నిషేధం, ఈ-స్పోర్ట్స్, ద్రవ్యేతర నైపుణ్య ఆధారిత గేమ్‌లను నిరంతరం ప్రోత్సహించడం, నమోదుకాని లేదా చట్టవిరుద్ధమైన గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది.

Next Story