ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. 'వర్క్ ఫ్రమ్ హోమ్'పై కేంద్రం కీలక క్లారిటీ

by Prasad Jukanti |

ఐటీ రంగానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.

ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. వర్క్ ఫ్రమ్ హోమ్పై కేంద్రం కీలక క్లారిటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశీ మారక విలువల పొదుపులో భాగంగా ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) పై కేంద్రం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఐటీ రంగానికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనను తప్పనిసరి చేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని అధికారిక వర్గాలు బుధవారం స్పష్టం చేసినట్ల జాతీయ మీడియా పేర్కొంది. అంతర్జాతీయ ఇంధన ధరలు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన వినియోగంపై జాగ్రత్తగా ఉండాలని ప్రధాని కోరినప్పటికీ, ఐటీ రంగానికి అటువంటి ఆదేశాలు జారీ చేసే యోచన లేదని వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ పిలుపు కేవలం ఒక విజ్ఞప్తి మాత్రమేనని ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ఆదేశాలు పరిశీలనలో లేవని తెలిపాయి.

ఆ దిగుమతులపై ఆంక్షలు లేవు:

అలాగే ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై ఎటువంటి ఆంక్షలు విధించే ప్రణాళిక లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తయారీ, ఎగుమతులు మరియు డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ వంటి ఉత్పాదక రంగాలలో ఎలక్ట్రానిక్స్ దిగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా మెమరీ చిప్ ధరలు పెరగడం వల్ల ఎలక్ట్రానిక్స్ దిగుమతుల విలువ పెరిగే చాన్స్ ఉందని తెలిపారు. డేటా సెంటర్ల నిర్మాణానికి ఏఐ (AI) సర్వర్లు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 116.17 బిలియన్ డాలర్లుగా ఉంది.

Next Story