అల్‌ఖైదా గుజరాత్‌ ఉగ్ర కుట్ర.. ఐదు రాష్ట్రాల్లో NIA ముమ్మర తనిఖీలు

by Kema Shiva Kumar |

అల్‌ఖైదా (Al-Qaeda) గుజరాత్‌ ఉగ్ర కుట్ర కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణను వేగవంతం చేసింది.

అల్‌ఖైదా గుజరాత్‌ ఉగ్ర కుట్ర.. ఐదు రాష్ట్రాల్లో NIA ముమ్మర తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: అల్‌ఖైదా (Al-Qaeda) గుజరాత్‌ ఉగ్ర కుట్ర కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విచారణను వేగవంతం చేసింది. ఈ మేరకు కేసులో నలుగురు అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోని అనుమానితులు, వారి సహచరుల నివాసాల్లో ఎన్‌ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఈ సోదాల్లో అనేక డిజిటల్ పరికరాలు, ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.

కాగా, 2023 జూన్‌‌లో గుజరాత్ (Gujarat) ఉగ్ర కుట్రకు సంబంధించి పోలీసులు కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఆ సమయంలో నలుగురు బంగ్లాదేశ్ పౌరులపై కేసు నమోదు అయ్యాయి. వారిలో మహ్మద్ సోజిబ్‌ మియాన్, మున్నా ఖాలిద్ అన్సారీ (అలియాస్ మున్నా ఖాన్), అజరుల్ ఇస్లాం (అలియాస్ జహంగీర్, ఆకాష్ ఖాన్), అబ్దుల్ లతీఫ్ (అలియాస్ మొమినుల్ అన్సారీ) ఉన్నారు. ఈ నలుగురు నిషేధిత అల్‌ఖైదా సంస్థకు చెందినవారని, నకిలీ డాక్యుమెంట్లతో భారత్‌లోకి ప్రవేశించారని ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌ (Bangladesh)లోని అల్‌ఖైదా ఆపరేటివ్‌లకు నిధులు సేకరించి బదిలీ చేసినట్లుగా ఎన్‌ఐఏ గుర్తించింది. ముస్లిం యువతను రెచ్చగొట్టే చర్యల్లో వారు అత్యం చురుకుగా పాల్గొన్నట్లుగా తేలింది. దీంతో 2023 నవంబర్ 10న అహ్మదాబాద్ NIA స్పెషల్ కోర్టులో ఐదుగురు నిందితులపై చార్జ్‌షీట్ దాఖలై దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story