అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ సోదరుడు అరెస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-17 09:23:57  IST  )

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది.

అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ సోదరుడు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు వేళ.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒక ఆర్థిక మోసం కేసులో అల్-ఫలాహ్ యూనివర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ సోదరుడు అహ్మద్ సిద్ధిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను హైదరాబాద్ లో ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి మధ్యప్రదేశ్ కు తరలించినట్లు వెల్లడించారు. సుమారు పాతికేళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని మోహోలో పెద్దఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు హమూద్ అహ్మద్ సిద్దిఖీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

2000 సంవత్సరంలో నకిలీ ప్రైవేట్ బ్యాంకును స్థాపించి.. స్థానికంగా ఉన్న వందలాదిమందికి అధిక డిపాజిట్ల ఆశచూపించాడు. వారి నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్లు రాబట్టిన తర్వాత అహ్మద్ సిద్దిఖీ బోర్డు తిప్పేసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఇదంతా మోసమని గ్రహించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అహ్మద్ కోసం పోలీసులు వెతుకుతుండగా.. ఆదివారం (నవంబర్ 16) హైదరాబాద్ లో దొరికాడని మోహో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ లలిత్ సింగ్ సికార్వర్ తెలిపారు. ప్రస్తుతం అతను ఒక షేర్ ట్రేడింగ్ లో పనిచేస్తూ.. లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నాడని వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ పేలుడు కుట్ర వెనుక ఉగ్రడాక్టర్ల ప్రమేయం ఉందని నిర్థారణ అయిన క్రమంలో.. వారు డిగ్రీ పొందిన అల్ ఫలాహ్ యూనివర్సిటీని ఈ కేసు విచారణలో చేర్చారు. ఈ క్రమంలో వర్సిటీ ఛైర్మన్ జావెద్ సిద్ధిఖీ పూర్వపరాలను పరిశీలిస్తుండగా.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న హమూద్ కేసు వివరాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Next Story