- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Al-Bashir: సిరియా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అల్ బషీర్.. ప్రకటించిన రెబల్ గ్రూప్ హెచ్‌టీఎస్ !
సిరియాలో అంతర్యుద్ధం తర్వాత రెబల్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) నేతృత్వంతో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలో అంతర్యుద్ధం తర్వాత రెబల్ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ (HTS) నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ అల్-బషీర్(Al-Bashir)ను నియమించినట్టు పలు కథనాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది మార్చి 1 వరకు ఆయన నూతన ప్రభుత్వా్న్ని నడపనుండగా ఆ తర్వాత ఎన్నికలు జరగనున్నట్టు సమాచారం. బషీర్ కు మంత్రివర్గం సైతం ఉండనుండగా దేశ కార్యకలాపాలను ఆయన నిర్వహించనున్నారు. బషీర్ ప్రకటన అనంతరం సివిల్ సర్వెంట్లు, ఆరోగ్య కార్యకర్తలు విధుల్లోకి తిరిగి రావాలని తిరుగుబాటు దారులు విజ్ఞప్తి చేశారు. కాగా, 1983లో ఇద్లిబ్‌లోని జబల్ జావియా ప్రాంతంలో జన్మించిన అల్ బషీర్ అలెప్పో యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందాడు. ఆయనను తిరుగుబాటుదారుల సూత్రధారిగా పరిగణిస్తారు. బషర్ అల్-అస్సాద్‌ను గద్దె దింపడంలో ఆయన సహకారం ఎక్కువగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.






