- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనం వదిలేసేవాళ్లం కాదు.. మమతా, స్టాలిన్ ఫోటోలతో కాంగ్రెస్‌కు అఖిలేష్ యాదవ్ కౌంటర్
తమిళనాడులో టీవీకేకు మెజారిటీ సీట్లు రావడంతో కాంగ్రెస్ ఆ పార్టీతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల వరకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను విడిచి టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో టీవీకేకు మెజారిటీ సీట్లు రావడంతో కాంగ్రెస్ ఆ పార్టీతో జతకట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల వరకు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను విడిచి టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మరోవైపు బెంగాల్ లోనూ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లతో ఉన్న ఫోటోను షేర్ చేసి.. కష్ట సమయాల్లో మనం ఒకరినొకరు వదిలేసేవాళ్లం కాదు.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
అఖిలేష్ ట్వీట్ కాంగ్రెస్ ను ఉద్దేశించే చేశారని అర్థం అవుతోంది. డీఎంకే సైతం రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీఎంకేతో పొత్తు తెంచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీవీకేకు మద్దతు ఇవ్వడంతో ఇండియా బ్లాక్ అంతమైందని డీఎంకే గురువారం అధికారికంగా ప్రకటించింది. తమిళనాట జరిగిన ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమిపై ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అవ్వడంపై పలు పార్టీలు ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు కూటమి భవిష్యత్ పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.






