Prayagraj : ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అఖండ -2 మూవీ టీమ్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-16 06:46:03  IST  )

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగరాజ్‌(Prayagraj Maha Kumbh Mela)లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ కోట్లాది మంది భక్తులు..14 అఖాడాలకు చెందిన లక్షలాది మంది సాధువులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు.

Prayagraj : ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అఖండ -2 మూవీ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగరాజ్‌(Prayagraj Maha Kumbh Mela)లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ కోట్లాది మంది భక్తులు..14 అఖాడాలకు చెందిన లక్షలాది మంది సాధువులు పవిత్ర సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రత్యేక మహా కుంభమేళా కావడంతో భక్తులు, యాత్రికులు, విదేశీయులూ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌రాజ్‌ నదీ తీరం జనం సముద్రంలా మారింది.

సరిగ్గా ఇదే సమయంలో హీరో నందమూరి బాలకృష్ణ అఘోర పాత్రధారిగా నటిస్తున్న అఖండ 2(Akhanda-2 movie)సినిమా షూటింగ్(Shooting) ప్రయాగ రాజ్ లో సినిమా యూనిట్ కొనసాగిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దర్శకుడు బోయపాటి(Director Boyapati) షూటింగ్ పై స్పందిస్తూ మహాకుంభ మేళ ఏర్పాట్లు చాల బాగున్నాయని, మా సినిమా ఆఖండ2 షూటింగ్ కోసం ఇక్కడకు 11వ తేదీన ఇక్కడకు వచ్చామన్నారు. అఘోర పాత్రతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళలో కోట్ల మంది భక్తుల మధ్య, లక్షల మంది అఘోరాలు..నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులను కలుస్తామన్నారు. ఈ రోజు చివరి షూటింగ్ చేస్తున్నామన్నారు. మా ప్రయత్న లోపం లేకుండా అఖండ సినిమా షూటింగ్ చేస్తున్నామన్నారు.

మహాకుంభమేళతో ప్రయాగ్ రాజ్ ఘాట్ లు భక్తులు, సాధువులతో కిటకిటలాడింది. ఇప్పటికే 4కోట్ల మందికి పైగా భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 8కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని చెబుతోంది. జనవరి 13న 1.75 కోట్లమంది స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

14న 3.5 కోట్ల మంది దాకా స్నానం చేశారని తెలుస్తుండగా… యూపీ ప్రభుత్వం మాత్రం రెండు రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది స్నానాలు చేశారని తెలిపింది. 15న కనుమ రోజున కూడా దాదాపు 3 కోట్ల మందికి పైగా స్నానం చేశారని అంచనా. ఇలా 3 రోజుల్లో 8 కోట్ల మంది దాకా కుంభమేళాకి వచ్చి స్నానాలు చేశారని అంటున్నారు. జపాన్ రాజధాని టోక్యో నగరం జనాభా 3.74 కోట్లు కాగా..ఈ రికార్డును ప్రయాగరాజ్ అధిగమించింది. ప్రజలు ఒక రోజే అంత మంది ఉన్నటువంటి.. ప్రపంచంలో అత్యధిక జనాభా గల నగరంగా ప్రయాగరాజ్ రికార్డులకెక్కినట్లైంది.

Next Story