- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
32 ఏళ్ల కిందటి సామూహిక లైంగిక దాడి కేసు.. నిందితులకు జీవిత ఖైదు విధించిన కోర్టు
దేశంలోనే సంచలనం రేపిన అజ్మేర్ బ్లాక్ మెయిల్ సెక్స్ స్కాండల్ కేసులో.. ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది.

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే సంచలనం రేపిన అజ్మేర్ బ్లాక్ మెయిల్ సెక్స్ స్కాండల్ కేసులో.. ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. దీంతో పాటు నిందితులకు రూ. 5 లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది. అజ్మేర్ లోని ప్రత్యేక కోర్టు ఈ కేసుకు సంబంధించి తీర్పునిచ్చింది. 32 ఏళ్ల ఈ సెక్స్ స్కాండల్ కేసులో.. సలీం చిస్తీ, నఫీస్ చిస్తీ, నసీం సయ్యద్, ఇక్బాల్ భాటి,, జమీర్ హుస్సేన్, సోహైల్ ఘనీలను దోషులుగా తేల్చింది. ఈ లైంగిక కుంభ కోణానికి సంబంధించి మొత్తం 18 మంది నిందితులు ఉండగా వారిలో 9 మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. మిగిలిన 9 మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా .. ఇంకొకరు పరారీలో ఉన్నారు. మరొకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతుంది. కాగా 1992 లో 100 మందికి పైగా.. కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేసి వారి నగ్న ఫోటోలను ప్రసారం చేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఫరూఖ్ చిస్తీ. అయితే 1992 లో స్కూల్, కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెల్సిందే.
వివరాల్లోకెళ్తే..
అజ్మేర్ లోని అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూఖ్ చిస్తీ, అతని సహచరుడు నఫీస్, ఇంకా మిగిలిన వారి అనుచరులు కాలేజీ అమ్మాయిలను మానసికంగా వేధిస్తూ, వారి వెంట పడేవారు. ఫామ్ హౌస్ లు, రెస్టారెంట్ లలో అమ్మాయిలను పిలిచి వారికి మత్తు మందు ఇచ్చి, సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. తర్వాత వారి నగ్న ఛాయాచిత్రాలను కూడా తీసేవారు. తదనంతరం అదే అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి, వేరే అమ్మాయిలను కూడా తమ వెంట తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు.






