- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెల్జియం రేసులో హీరో అజిత్ సత్తా: పోడియంపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా (ఫోటోలు)
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మోటార్ స్పోర్ట్స్‌లో మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మోటార్ స్పోర్ట్స్‌లో మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎండ్యూరెన్స్ రేస్‌లలో ఒకటైన బెల్జియంలోని ‘సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్’ (Circuit de Spa-Francorchamps) ట్రాక్‌పై జరిగిన 24H సిరీస్‌లో అజిత్ రేసింగ్ టీమ్ రెండో స్థానంలో (P2) నిలిచి సత్తా చాటింది. విజయం అనంతరం పోడియంపై భారత జెండాను సగర్వంగా ప్రదర్శిస్తూ అజిత్ మరియు ఆయన బృందం చేసిన షాంపైన్ సెలబ్రేషన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ‘అభిరుచి, గర్వం కలిసే చోట.. అంతర్జాతీయ వేదికపై భారత జెండా సగర్వంగా ఎగురుతోంది. అజిత్ టీమ్ దేశానికి కీర్తిని తీసుకువచ్చింది’ అని ఆయన మేనేజర్ సురేష్ చంద్ర ఈ విజయానికి సంబంధించిన వీడియోను పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.
సినిమాల కంటే రేసింగ్‌కే ప్రాధాన్యం!
గతేడాది (2025) విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన అజిత్.. తన తదుపరి చిత్రాన్ని కూడా అదే దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తోనే ప్రారంభించాల్సి ఉంది. అయితే, 2026 రేసింగ్ క్యాలెండర్ ప్రకారం ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, యూకే, పోర్చుగల్ దేశాల్లో జరిగే ఛాంపియన్‌షిప్‌లలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఈ రేసింగ్ కమిట్‌మెంట్స్ కారణంగానే కొత్త సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.






