Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య.. ఎన్సీపీ బాధ్యతలు మాత్రం ఆయన చేతికి?

by Prasad Jukanti |   (  Updated:2026-01-29 13:39:43  IST  )

అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్సీపీ ముఖ్య నేతలు సునేత్రా పవర్ తో భేటీ కావడం ఆసక్తిగా మారింది.

Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య.. ఎన్సీపీ బాధ్యతలు మాత్రం ఆయన చేతికి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం నింపింది. విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ వారసులు ఎవరు అనే చర్చ ఇప్పు జోరందుకుంది. మహాయుతి కూటమిలో భాగంగా అజిత్ పవార్ డిప్యూటీ పదవి దక్కించుకోగా ఆ పోస్టుపై ఇప్పుడు ఎన్సీపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ స్థానంలో డీసీఎంగా ఆయన భార్య సునేత్ర పవార్ ను ప్రతిపాదించాలని ఎన్సీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిసిన గంటల వ్యవధిలోనే ఎన్సీపీ కీలక నేతలు సునేత్రతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ నాయకులు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్ బల్, ధనంజయ్ ముండే ఇవాళ సునేత్ర పవార్‍ను కలిసి ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని వారు ఆమెను కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

బారామతి నుంచి పోటీ!:

అజిత్ పవార్ ప్రాతినిథ్యం వహించిన బారామతి స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి మంత్రివర్గంలో భాగం కావాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం అని ఇందులో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని భుజ్ బల్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఎన్సీపీ పార్టీ బాధ్యతలు ప్రఫుల్ పటేల్ కు దక్కబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంత ఉంది రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

అజిత్ పవార్ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ స్వాధీనం: సీఎంకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ

Next Story