పుతిన్ తో అజిత్ దోవల్ భేటీ

by Muthe.Rajitha |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో... భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలో ఉన్నారు.

పుతిన్ తో అజిత్ దోవల్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో... భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో దోవల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం అయ్యారు. క్రెమ్లిన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో రష్యా భద్రతామండలి అధికారులు పాల్గొన్నారు. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు జరుపుతోందనే నెపంతో అమెరికా భారత్ పై 50 శాతం పన్నులు అదనపు విధించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాగా అంతకముందు అజిత్ దోవల్ రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో కూడా సమావేశమయ్యారు. పుతిన్ యొక్క భారత పర్యటనకు సంబంధించిన తేదీలను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటన ఈ ఏడాది చివర్లో జరగవచ్చని అజిత్ దోవల్ వెల్లడించారు.

Next Story